2019-20 బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు

2019-20 బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు
x
Highlights

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే శాసన సభా సమావేశాల్లో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే శాసన సభా సమావేశాల్లో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని..ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు ఉండేలా చూడాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక మాంద్యం ప్రభావం బడ్జెట్ పై చూపే అవకాశాలున్నాయని భావిస్తుండటంతో..ఎన్నికల హామీలు ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. బడ్జెట్ రూపకల్పనపై ఇవాళ కూడా కసరత్తు చేపట్టనున్నారు సీఎం కేసీఆర్.

గత మార్చిలో తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్..2019-20 ఆర్ధిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో కసరత్తు చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరుపాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అత్యధిక నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం రాష్ర్ట బడ్జెట్ పై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలపై ఆర్ధిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. షాదిముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్దాప్య పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, రైతు బంధు బకాయిలు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయాల్సి ఉంది.ఆదాయం, అవసరాలకు అనుగుణంగా ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని.. ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు ఉండేలా చూడాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశ పరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం వంటి ప్రక్రియలు నిర్వహించాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories