మొక్కజొన్న పిండితో ప్లేట్లు, గ్లాసులు, స్పూన్‌లు: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయత్నం

మొక్కజొన్న పిండితో ప్లేట్లు, గ్లాసులు, స్పూన్‌లు: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయత్నం
x
Highlights

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు నో ప్లాస్టిక్, నో వెండింగ్‌ నినాదంతో వినూత్న ఆలోచనను చేసారు.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు నో ప్లాస్టిక్, నో వెండింగ్‌ నినాదంతో వినూత్న ఆలోచనను చేసారు. ఇందులో భాగంగానే అధికారులు ఈకో ఫ్రెండ్లీ ఫుడ్‌ జోన్‌ను వ్యాపారుల కోసం ఏర్పాటు చేసారు. వీటిని ముఖ్యంగా రెడ్ జోన్లలో ఎక్కువగా ఉపయోగించనున్నారు.

రోడ్లపై వీధి వ్యాపారులు ఉండరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వాటిలో ముఖ్యంగా నగరంలోని చందానగర్‌ సర్కిల్‌–21 పరిధిలోని మెటల్‌ చార్మినార్‌ కమాన్‌ నుంచి న్యాక్‌ గేట్‌ వరకు అదే విధంగా మాదాపూర్‌లోని నీరూస్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌కు కుడివైపునకు ప్రకటించారు. ఈ ప్రాంతాలలో ఎక్కువగా వీధి వ్యాపారులు ఉన్నారని తెలిపారు.

ఇందులో భాగంగానే దాదాపు రూ.50 లక్షల వ్యయంతో, 50 ఫుడ్‌జోన్‌ స్టాళ్లను నెలకొల్పారు. ఈ స్టాల్లలో ప్రాముఖ్యత ఏంటంటే మొక్కజొన్న పిండితో చేసిన ప్లేట్స్, గ్లాసులు, స్పూన్‌లు, కంటెయినర్స్‌ విక్రయిస్తారు. వీటిని వాడి ఆ తరువాత నీటిలో పడేస్తే అవి కరిగిపోతాయి. అంతే కాదు ఈ స్టాల్లలో విద్యుత్ కు అంతరాయం కలగకుండా సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుత్‌ అందించనున్నారు.

అందుకోసం 6 కేవీ కెపాసిటీ కల్గిన రెండు చోట్ల సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాదు స్టాల్లు రంగులమయంగా ఉండేందుకు ఫుడ్‌ సంబంధిత పెయింటింగ్స్‌ వేశారు. వాటితో పాటుగానే షీ టాయిలెట్లు, స్టోన్‌ బెంచీలు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలు కలిగిన స్టాల్లను వ్యాపారులను బృందాలుగా చేసి అధికారులు అప్పగించారు.

ఇక పట్టణంలో ఏర్పాటు చేసిన 50 స్టాల్లలో ఇప్పటికే 47 మంది వ్యాపారులకు అప్పగించారు. దీంతో ఈ స్టాల్లలో హైదరాబాద్, ఇండియన్, ఇటాలియన్, చైనీస్‌ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఈ స్టాల్లు కస్టమర్లకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అంతే కాదు ఎవరైతే ఆహారాన్ని రుచికరంగా తయారు చేస్తారో వారికి జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ సర్టిఫికెట్‌ ఇవ్వనున్నారు. ఇక ఎవరైతే ఈ స్టాల్లను తీసుకున్నారో ఆ నిర్వాహకులు ఒక్కొక్కరూ ప్రతి నెలకు రూ.2వేలను మెయింటెనెన్స్‌ చెల్లిస్తారు. అందుకుగాను కరెంటు, వాటర్ వంటివి GHMC వ్యాపారస్తులకు ఇస్తుంది. ఇక ఈ స్టాళ్లను చూసేందుకు, ఫుడ్ టేస్ట్ చేసేందుకు నగర వాసులు మార్చి 8వ తేదినుంచి క్యూ కడుతున్నారు. ఇలాంటి స్టాళ్లు సిటీ అంతటా ఉంటే బాగుంటుందని, ఈ స్టాల్ల కారణంగా ప్లాస్టిక్ ని నిర్మూలించవచ్చని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories