Telangana: గెలుపు కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన రిపోర్టు

Telangana: గెలుపు కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన రిపోర్టు
x
Highlights

హుజూర్‌నగర్ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ గెలుపు కోసం ఈ సారి ప్రధాన పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తాయన్న సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి...

హుజూర్‌నగర్ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ గెలుపు కోసం ఈ సారి ప్రధాన పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తాయన్న సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. దీంతో అభ్యర్థులు, పార్టీలు ఖర్చుపెట్టే విధానం, ఎన్నికల ఖర్చు ఈసీకి తెలియకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సభలు, సమావేశాలను నియోజకవర్గం బయట ఏర్పాటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీల అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి చేయాల్సిన ఖర్చు 28లక్షలు. కానీ, ఇది ఈసీకి అభ్యర్థులు చూపించే ఖర్చయి ఉండాలి. కానీ, ఇది ఒక్క రూపాయి దాటినా ఆ అభ్యర్థిని ఈసీ అనర్హుడిగా చేస్తుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఖర్చులను ఎన్నికల సంఘం దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎక్కడా దొరకకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకుంటే బీజేపీ మాత్రం గెలుపు కోసం ఆ స్థాయిలో ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను బయట ప్రాంతాలకు రప్పించుకుని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి అవకాశంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి కూడా ఇదే తరహా సమావేశాలను బయట ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉప ఎన్నిక ఖర్చుల్లో చూపకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు నేతలు. మొత్తంమీద ఎన్నికల సంఘాన్ని బురుడీ కొట్టిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు హుజూర్‌నగర్ స్థానాన్ని దక్కించుకునేందుకు పోటీపోటీగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories