కొండెక్కిన చికెన్ ధరలు...

కొండెక్కిన చికెన్ ధరలు...
x
Highlights

గత రెండు నెలల కింద కరోనా వైరస్ ప్రభావం వలన చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి..

గత రెండు నెలల కింద కరోనా వైరస్ ప్రభావం వలన చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి.. ఎక్కువగా కరోనా వైరస్ జంతువుల నుంచి సోకుతుందనే ప్రచారం జరగడంతో జనాలు చికెన్ తినాలంటేనే వణికిపోయారు. దీనితో చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయి. ఇక గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో యజమానులు కొన్ని చోట్లల్లో కోళ్లను ఉచితంగా పంచారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఉత్పత్తి కూడా బాగా తగ్గింది.

అయితే ప్రస్తుతం చికెన్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కరోనా భయంతో సిద్దిపేట జిల్లాలో బాయిలర్‌ కోళ్ల ఫారాలు 40 మాత్రమే మిగిలాయని వ్యాపారులు అంటున్నారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్‌ ధరలు మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నాయని చెబుతున్నారు. ఒక్కప్పటి ధరలు మళ్లీ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.. చికెన్ తింటే కరోనా రాదని, తెలంగాణ మంత్రులు ముందునుంచి చెబుతున్నప్పటికీ జనాలు మాత్రం తినేందుకు ఆలోచించారు.. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. చికెన్ , గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని,కరోనా రాదని చెప్పుకొచ్చారు. దీంతో మళ్లీ చికెన్ ధరలుకి రెక్కలు వచ్చినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం లైవ్‌ కోడి కిలోకు రూ.70 ఉన్నట్లు, స్కిన్‌తో ఉండే చికెన్‌ కిలోకు రూ.160, స్కిన్‌లెస్‌ కిలోకు రూ.190కి అమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కిలో చికెన్ రూ.200 కు అమ్ముతున్నారు. కోడిగుడ్లు కూడా డజను రూ.45 నుంచి రూ.50 మధ్య ధర పలుకుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన పూర్తిస్థాయిలో చికెన్ షాపులు పూర్తిగా తెరుచుకో లేదని, త్వరలో తెరుచుకుని పూర్వ వైభవాన్ని పొందుతాయని యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories