నాణ్యత లేని మందులు

నాణ్యత లేని మందులు
x
Highlights

పరిసరాల పరిశుభ్రత, పండించే పంటల్లో నాణ్యత లేక పోవడంతోనే ప్రజలు అనారోగ్యం పాలవతున్నారు. ఆరోగ్యాన్ని సరి చేపించుకోవడానికి ఆస్పత్రులకు వెళితే అక్కడైనా సరైన మందులు ఇస్తున్నారా అంటే అదీ లేదు.

పరిసరాల పరిశుభ్రత, పండించే పంటల్లో నాణ్యత లేక పోవడంతోనే ప్రజలు అనారోగ్యం పాలవతున్నారు. ఆరోగ్యాన్ని సరి చేపించుకోవడానికి ఆస్పత్రులకు వెళితే అక్కడైనా సరైన మందులు ఇస్తున్నారా అంటే అదీ లేదు. నాణ్యత లేని మందులు, వాడి పాడేసిన సిరంజులు ఉపయోగిస్తున్నారు. దీనికి నిదర్శనం

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ వార్త. పీహెచ్‌సీ వైద్యులు ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంపులో ఇచ్చిన ప్యారసిటమల్ ట్యాబ్లెట్‌లలో ఏకంగా దోమ కనిపించింది. దీంతో వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఆ ట్యాబ్లెట్లను వెంటనే స్పందించినవాటిని వెనక్కి తీసుకొని వేరే వాటిని ఇచ్చి పంపించారు.

గ్రామ ఆరోగ్య వేదికలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు. లక్ష్మీనగర్‌కు చెందిన సీహెచ్‌ రాము అనే జ్వరానికి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో వైద్యులు అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లాక ట్యాబ్లెట్‌లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్‌ ప్యాకింగ్‌లో మృతి చెందిన దోమ కనిపించింది. దీన్ని వారి దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌లో నాణ్యత పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories