Top
logo

అక్కడ అయ్యప్పలు స్కూలుకు రాకూడదా?

అక్కడ అయ్యప్పలు స్కూలుకు రాకూడదా?
X
మెదక్‌
Highlights

అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడన్న కారణంతో విద్యార్థిని స్కూల్లోకి అనుమతించలేదు. దీంతో స్కూల్‌ మేనేజ‌్ మెంట్‌...

అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడన్న కారణంతో విద్యార్థిని స్కూల్లోకి అనుమతించలేదు. దీంతో స్కూల్‌ మేనేజ‌్ మెంట్‌ వైఖరికి నిరసనగా విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని డాన్‌ బాస్కో పాఠశాలలో దుర్గా ప్రసాద్‌ అనే విద్యార్థి 5వ తరగతి చదువుకుంటున్నాడు. అయితే అయ్యప్పమాల వేసుకున్నాడన్న కారణంగా దుర్గా ప్రసాద్‌‌ను పాఠశాలకు రావొద్దంటూ యాజమాన్యం హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థి దుర్గా ప్రసాద్‌ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప స్వాములతో కలిసి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం స్కూల్‌ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా డాన్‌ బాస్కో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ హిందూమతంపై వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తుందని అయ్యప్పస్వాములు ఆరోపిస్తున్నారు.


Web TitleDonbosco School Management Not Allowed Student for Wearing Ayyappa Mala
Next Story