Corona Effect : రూ.4.13 లక్షలు నష్టపోయిన వైద్యుడు..ఎలాగంటే..

Corona Effect : రూ.4.13 లక్షలు నష్టపోయిన వైద్యుడు..ఎలాగంటే..
x
Representation image
Highlights

కరోనా వైరస్ కారణంగా శానిటైజర్స్ కి, మాస్క్‌లకి మార్కెట్లో పెద్ద ఎత్తునే డిమాండ్ పెరిగింది.

కరోనా వైరస్ కారణంగా శానిటైజర్స్ కి, మాస్క్‌లకి మార్కెట్లో పెద్ద ఎత్తునే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత మంది నకిలీ శానిటైజర్స్ తయారు చేసి మార్కెట్లోకి అమ్ముతున్నారు. ఇక మాస్కుల ధరైతే ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ డాక్టర్ మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ అతని ప్లాన్ ఫ్లాప్ అయి సైబర్ నేరగాల్లో చేతిలో మోసపోయాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టయింది ఆ డాక్టర్ కి.

పూర్తివివరాల్లోకెళితే యాకుత్ పురాకు చెందిన ఓ డాక్టర్ ఒక వెబ్సైట్ లో సర్జికల్ మాస్క్‌ కొనుగోలుకు ఆర్డర్ పెట్టాడు. దీంతో వైద్యునికి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తి కాల్ చేసారు. మీరు ఆర్డర్ పెట్టిన మాస్క్‌లను మీకు పంపించాలంటే 30శాతం నగదు ముందుగానే చెల్లించాలని తెలిపారు. అప్పుడే 50 మాస్కుల కార్టన్లు పంపిస్తామని అన్నారు. అంతే కాదు డాక్టర్ కి యూఎస్ నుంచి పంపిన పార్శిల్ ట్రాకింగ్ వివరాలనుకూడా తెలిపారు. తన సరుకు తన దగ్గరికి చేరుకుంటుందని నమ్మని వైద్యుడు వెంటనే పార్శిల్ పంపిన వారికి సుమారుగా రూ.1.73 లక్షలు జమచేశాడు. అక్కడితోనే వదిలేయకుండా ముందుగా ఆర్డర్ పెట్టిన పార్శిల్ చేరకముందే వైద్యుడు మార్చి 4వ తేదీన మరోసారి 150 మాస్క్‌ల కార్టన్ల కోసం రూ.2.4లక్షలు జమచేశాడు. ఇక ఆ డబ్బులను డ్రా చేసుకున్న సైబర్ నేరగాల్లు డాక్టర్ ఎన్ని సార్లు కాల్ చేసినా స్పందించలేదు. ఎలాంటి సమాచారం కూడా అందించలేదు. దీంతో ఆ వైద్యుడు తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరూ కూడా ఆన్లైన్ లో ఎక్కువ మొత్తం నగదుతో షాపింగ్ చేయకూడదని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రజల పాలిట శాపంగా మారినా సైబర్ నేరగాల్ల పాలిట అదృష్టంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories