మద్యపాన నిషేధం కోసం రెండురోజుల దీక్ష

మద్యపాన నిషేధం కోసం రెండురోజుల దీక్ష
x
డి.కె. అరుణ
Highlights

అత్యాచారం బాధితురాలు మానసకు న్యాయం జరగలేదని బీజేపీ నాయకురాలు డి.కె. అరుణ ఆరోపించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఉన్నారని మానస తల్లిదండ్రులు...

అత్యాచారం బాధితురాలు మానసకు న్యాయం జరగలేదని బీజేపీ నాయకురాలు డి.కె. అరుణ ఆరోపించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఉన్నారని మానస తల్లిదండ్రులు చెబుతున్నా పోలీసులు పట్టించకోవడంలేదన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యంతో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12, 13 తేదిల్లో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories