స్మశానంలో దీపావళి వేడుకలు... ఎక్కడో తెలుసా ?

స్మశానంలో దీపావళి వేడుకలు... ఎక్కడో తెలుసా ?
x
Highlights

అదో స్మశానం.. చుట్టూ సమాధులు... అక్కడే పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు ఇదీ కరీంనగర్‌లో కనిపించే ఓ సాంప్రదాయం. దీపావళి పండుగ అంటే ఇల్లంతా దీపాలతో...

అదో స్మశానం.. చుట్టూ సమాధులు... అక్కడే పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు ఇదీ కరీంనగర్‌లో కనిపించే ఓ సాంప్రదాయం. దీపావళి పండుగ అంటే ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. కానీ కరీంనగర్‌లోని ఓ సంప్రదాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. చనిపోయిన తమ పెద్దలను కుటుంబ సభ్యులను స్మరిస్తూ స్మశాన వాటికలోని వారి సమాధుల వద్ద ఇంటిళ్ల పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు. చనిపోపోయిన తమ వారి సమాధుల దగ్గర వారికి నైవేద్యాన్ని పెట్టి అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు ఇలా జరుపుకోవడం కరీంనగర్‌లోని కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది.

కరీంనగర్ ఆదర్శనగర్‌లోని స్మశాన వాటికలో గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇలా స్థానికులు జరుపుకుంటున్నారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధిని అలంకరిస్తారు. చనిపోయిన వారికీ ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అక్కడే దీపాలను వెలిగించి టపకాయలు కాల్చుతూ పండగను జరుపుకుంటారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories