దిశ హత్యకేసులో..నేరం రుజువైతే మరణ శిక్ష

దిశ హత్యకేసులో..నేరం రుజువైతే మరణ శిక్ష
x
Highlights

ఒక నిర్భయ, ఒక ఆసీఫా, వరంగల్ లో 9 నెలల చిన్నారికి సంబంధించిన ఘటనల తరువాత అంతటి సంచలనాన్ని సృష్టించిన ఘటన దిశ హత్యాచారం సంఘటన.

ఒక నిర్భయ, ఒక ఆసీఫా, వరంగల్ లో 9 నెలల చిన్నారికి సంబంధించిన ఘటనల తరువాత అంతటి సంచలనాన్ని సృష్టించిన ఘటన దిశ హత్యాచారం సంఘటన. నోరులేని మూగ జీవాలకు వైద్యం చేయాలంటూ ఎన్నో కలలు కన్న దిశను నలుగురు నరరూప రాక్షసులు కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై ఇప్పటికే 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్/డబ్లూ 34,392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై స్పందించిన సీఎం కేసీఆర్ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని సాక్షాధారాలు స్వీకరించిన పోలీసులు, మరికొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్ సిద్దపరుస్తున్నారు.

సంఘటనా స్థలంలో మృతురాలికి సంబంధించిన వస్తువులను సేకరించారు. దిశను హత్య చేసిన తరువాత తన మీద పోసిన పెట్రోల్ ఏ బంక్ లో కొనుగోలు చేశారో అనే ఆధారాలను సేకరించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన వెంటనే చార్జిషీట్ ను పోలీసులు దాఖలు చేయనున్నారు. ఈ కేసులో పోలీసులు నిందితులపైన దాఖలు చేసిన చార్జిషీట్ లోని అంశాలు న్యాయస్థానంలో రుజువైతే నిందితులకు మరణశిక్ష తప్పదని పోలీసులు , న్యాయవ్యవస్త తెలుపుతుంది.

ఈ హత్య కేసులో హై విట్నెస్ గా నిందితులు నడిపించిన లారీ యజమాని. ఈ కేసు ఇప్పుడు లారీ యాజమాని ఇచ్చే వాగ్మూలం మీద ఆధారపడి ఉంది. ఇప్పటికే హత్య జరిగిన రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు లారీ ఏయే ప్రాంతాకు వె‌ళ్లింది. ఎక్కడ ఉంది అన్న విషయాలను గురించిన ఆధారాలను సేకరించారు పోలీసులు. అంతే కాక దొండు పల్లి టోల్ ప్లాజా వద్ద ఎన్ని గంటనుంచి లారీ ఉంది. అక్కడ పరిసరాల్లో నిందతులు ఏం చేశారు. అన్న ప్రతి ఒక్క కదలికను తెలుసుకోవడానికి పోలీసులు సీసీ ఫుటేజిని ఆధారంగా సేకరించారు.

ఇదిలా ఉంటే నిందుతులను కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ ధాఖలు చేయనున్నారు. ఇప్పటికే హత్యా ఘటనపై కీలక సమాచారం సేకరించారు. మరింత సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కోణంలో నిందుతులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలనుకుంటున్నారు పోలీసులు.

నిందితులకు భారీ భద్రత

హత్య కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న నలుగురికి జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ నలుగురిని ఒకే సెల్ లో ఉంచారు. వారి ఆరోగ్యపరిస్థితులపై ఎప్పటికప్పుడు వారిని పరిశీలించి సమాచారం తీసుకుంటున్నారు. జైల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరికి భద్రతగా ఎనిమిది మంది వార్డర్లను, ఇద్దరు హెడ్ వార్డర్లను, ప్రత్యేకంగా నియమించారు. శనివారం రాత్రి నిందితులకు సంబంధించిన వివారలను ఆన్ లైన్ లో నమోదు చేశారు.

చెర్లపల్లి సెంట్రల్ జైల్ ఆవరణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో నిందితుకు వైద్య పరీక్షలు జైల్లోనే చేయించారు. సాధారణంగా ఏ నేరస్తునికైనా ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు చేయించి జైల్ కి తీసుకొస్తారు. ఈ నలుగురు చేసిన నేరానికి సమాజంలోని ప్రజలు నిందుతులు కనిపిస్తే వారిపై దాడిచేయడానికి సిద్దంగా ఉన్నారు. దీంతో వారికి వైద్యం కూడా జైల్లోనే చేపిస్తున్నారు. భోజనసమయంలోనే ఆ నలుగురిని వరండాలో తిప్పుతూ వారి కదలికలను, మార్పులను, ముఖ కవళికలను గమనించారు. వారిలో ఎలాంటి భావోద్వేగాలు లేవని జైలు సిబ్బంది అధికారులకు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories