దిశకేసు : నలుగురు నిందితుల అంత్యక్రియలు పూర్తి

దిశకేసు : నలుగురు నిందితుల అంత్యక్రియలు పూర్తి
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన 18 రోజులు తర్వాత మృతదేహాలను పోలీసులు వారి కుటుంబ...

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన 18 రోజులు తర్వాత మృతదేహాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అందజేసారు. భారీ భద్రత మధ్య రెండు అంబులెన్సుల్లో మృతదేహాలను సొంత గ్రామమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకి తీసుకొచ్చారు. వెంటనే జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, జక్లేర్‌లో మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలను వారి కుటుంబసభ్యులు సంప్రదాయాలతో నిర్వహించారు. సోమవారం రాత్రికి రాత్రే ఈ తంతును పూర్తి చేసారు.

హైదరాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశ ను నిందితులు అత్యాచారం చేసి హత్యచేసారు. అనంతరం అతి కిరాతకంగా సజీవ దహనం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అనంతరం నలుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. కొద్ది రోజులకు నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు అంగీకరించింది. తరువాత సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారీపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్‌ కేసుపై మానవహక్కుల సంఘం విచారణ కొనసాగిస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories