హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రిలిమినరి రిపోర్ట్

హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రిలిమినరి రిపోర్ట్
x
Highlights

దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రిలిమినరి రిపోర్ట్ హైకోర్టుకు చేరింది. ఎయిమ్స్ వైద్యులు ప్రిలిమినరి రిపోర్ట్‌తో పాటు సీడీని రిజిస్ట్రార్‌కు అందజేశారు....

దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రిలిమినరి రిపోర్ట్ హైకోర్టుకు చేరింది. ఎయిమ్స్ వైద్యులు ప్రిలిమినరి రిపోర్ట్‌తో పాటు సీడీని రిజిస్ట్రార్‌కు అందజేశారు. ఢిల్లీ వెళ్లాక పూర్తి స్థాయి రిపోర్ట్ అందజేస్తామని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. మృతదేహాల పరిస్థితి, వాళ్లు మృతిచెందినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వంటి కీలకమైన అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేసేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అందువల్ల ఢిల్లీ వెళ్లిన వారంలోగా సమగ్రమైన నివేదికను పంపిస్తామని ఎయిమ్స్ బృందం పేర్కొంది.

నిన్న గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితులకు ప్రత్యేకమైన బందోబస్తు మధ్య రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు దిశ కేసు నిందితుల అంత్యక్రియలు పూర్తయిన సంగతి తెలిసిందే. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. జక్లేర్‌లో మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలు నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories