'అది నిజమేనా సర్':దర్శకుడు మారుతి - 'అటువంటిది ఏం లేదు':కేటీఅర్

అది నిజమేనా సర్:దర్శకుడు మారుతి - అటువంటిది ఏం లేదు:కేటీఅర్
x
Highlights

ఒక ఆంగ్ల దిన పత్రికలో హైదరాబాద్ కు తీవ్ర నీటి కొరత రానుందని వచ్చిన వార్తపై దర్శకుడు మారుతి స్పందించారు. అయన ట్విట్టర్ ద్వారా టీఅరెస్ కార్యనిర్వాహక...

ఒక ఆంగ్ల దిన పత్రికలో హైదరాబాద్ కు తీవ్ర నీటి కొరత రానుందని వచ్చిన వార్తపై దర్శకుడు మారుతి స్పందించారు. అయన ట్విట్టర్ ద్వారా టీఅరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్ ను ఈ విషయమై 'అది నిజమేనా సర్' అంటూ ప్రశ్నించారు.

దానికి కేటీఅర్ వెంటనే సమాధానం ఇచ్చారు. అలాంటేదేమీ లేదని కేటీఅర్ స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్‌ కచ్చితమైనది కాదన్నారు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుందని, దీంతో హైదరాబాద్‌ కు 175 ఎంజీడీల నీరు అందుతుందని, తాగునీటి సమస్య చోటుచేసుకోదని తెలిపారు. ఇదే సమయంలో నగర పౌరులంతా, నీటి పొదుపునకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇక కేటీఆర్ సమాధానంపై సంతృప్తిచెందిన మారుతి, శుభావార్త చెప్పారంటూ ధన్యవాదాలు తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories