సమ్మక్క సారక్క.. తీరొక్క మొక్కులు

సమ్మక్క సారక్క.. తీరొక్క మొక్కులు
x
Highlights

మేడారం జాతర సందడి మొదలయింది. ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది భక్తులు ఈ జాతరకు తరళి వస్తున్నారు. ఈ సారి దాదాపుగా ఈ జాతలో కోటి యాభై లక్షల మందికి పైగా భక్తులు రానున్నారని అంచనా.

మేడారం జాతర సందడి మొదలయింది. ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది భక్తులు ఈ జాతరకు తరళి వస్తున్నారు. ఈ సారి దాదాపుగా ఈ జాతలో కోటి యాభై లక్షల మందికి పైగా భక్తులు రానున్నారని అంచనా. రెండేళ్ల కోసారి జరిగే ఈ జాతరలో భక్తులు వారి మొక్కులను వివిధ రకాలుగా తీర్చుకుంటారు. అమ్మవార్లకు బెల్లం, పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో మొక్కులు తీర్చుకుంటారు. అంతే కాదు మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవతలకు విభిన్న రీతులతో పూజలు నిర్వహిస్తారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, ఇలా ఎన్నో కోరిలతో అమ్మలను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొరికలు తీరితే మరుసటి ఏడాది మొక్కులు తీర్చుకుంటామని మొక్కుతారు. ఇక కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు.

భక్తులు సమ్మక్క సారలమ్మలను తమ ఆడపడుచులుగా భావించి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లిస్తారు. వారి ఇళ్లోనే భక్తులు నూతన వస్త్రం, జాకిటి, కొబ్బరి కుడుక, పోక, కజ్జుర, నాణంను ఒడిబియ్యంలో కలిపి శివసత్తులకు పోసి అమ్మవార్లకు పోస్తారు.

ఇందులో భాగంగానే మేడారం చేరుకున్న భక్తులు సర్వపాప హరిణిగా పేరు పొందిన జంపన్నవాగులో పుణ్య స్నానాలను చేస్తారు. ఈ వాగులో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మి స్నానాలు చేస్తారు. అనంతరం తరువాత అమ్మవార్లను గద్దెలకు తీసుకొచ్చే సమయంలో ఎదుర్కోళ్లతో అమ్మవార్లకు, పగిడిద్ద రాజుకు భక్తులు తీసుకొచ్చిన కోళ్లను, మేకలను అమ్మవారికి ఎదురు చూపి మొక్కుతుంటారు. తరువాత అమ్మవార్లను దర్శించుకని తరువాత కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు.

ఇక పోతే ఈ జాతరలో డప్పు చప్పుల్లతో పాటు, శివసత్తులు పూనకాలు ఎంతో ఆకర్షనీయంగా ఉంటాయి. స్వయాణ ఆ అమ్మవార్లే భక్తుల శరీరంలో పూని శివాలూగుతారు. దీంతో జంపన్న వాగు నుంచి అమ్మవారి గద్దెల వరకు శివసత్తుల పూనకాల దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఆడా మగా అనే తేడా లేకుండా ఈ పూనకాల్లో అందరూ శివాలూగుతూ జాతరకు వస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories