ఆగిన అంబులెన్స్..గాల్లో ప్రాణాలు..

ఆగిన అంబులెన్స్..గాల్లో ప్రాణాలు..
x
Highlights

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను ఆసుపత్రులకు తరలించాల్సిన అంబులెన్స్ లో డీజిల్ లేదని అధికారులు చేతులెత్తేశారు. అబార్షన్ అయిన మహిళా పేషంట్ ప్రాణాపాయ...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను ఆసుపత్రులకు తరలించాల్సిన అంబులెన్స్ లో డీజిల్ లేదని అధికారులు చేతులెత్తేశారు. అబార్షన్ అయిన మహిళా పేషంట్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. అయినా అంబులెన్స్ ఏర్పాటు చేయక పోగా అదే అంబులెన్స్ లో హరితహారం మొక్కలు తరలించారు అధికారులు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన వెలుగు చూసింది.

ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అబార్షన్ అయిన మహిళకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించాలని మహిళకు చికిత్స చేసిన వైద్యులు రెఫర్ చేశారు. ఆసుపత్రిలోని అంబులెన్స్ లో డీజిల్ లేదంటూ అధికారులు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళా బాధతో కొట్టు మిట్టాడుతున్నా అంబులెన్స్ సౌకర్యం కల్పించలేకపోయారు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం అంబులెన్స్ సౌకర్యం కల్పించలేకపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ బంధువులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories