పోలీస్ అధికారికి చెందిన ఇంటి గోడ కూల్చివేత

పోలీస్ అధికారికి చెందిన ఇంటి గోడ కూల్చివేత
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ అధికారికి చెందినదిగా భావిస్తున్న ఇంటి నిర్మాణాన్ని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కూల్చివేసింది. జూబ్లీహిల్స్...

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ అధికారికి చెందినదిగా భావిస్తున్న ఇంటి నిర్మాణాన్ని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని 149 ప్లాటు నంబర్‌లో ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలుసిందే. ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా పలు అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

అందులో భాగంగా ఏపీకి చెందిన అధికారి ఇంటి ఆక్రమణలను తొలగించారు. కాగా ప్రశాసన్‌నగర్‌లో ఆ పోలీస్ అధికారి పార్కును ఆక్రమించుకుని, అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని.. దీనిపై విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories