వాయిదా పడ్డ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు

వాయిదా పడ్డ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు
x
Highlights

ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించడంతో విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి.

ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించడంతో విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి. ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండింది.

కాని ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించడంతో పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ మార్పులు చేసింది. అక్టోబరు 21 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అక్టోబరు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ పాఠశాలలు ప్రారంభమైన రెండు రోజులకే పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని ప్రభుత్వం భావించింది. దీంతో మరోసారి పరీక్షల షెడ్యూలును మార్చింది. అక్టోబరు 25 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అక్టోబరు 27న దీపావళి పండుగ ఉండటంతో 28న పరీక్ష నిర్వహించడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories