మా నాన్న మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉన్నారు...

మా నాన్న మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉన్నారు...
x
Highlights

కరోనా వైరస్ ను తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.

కరోనా వైరస్ ను తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.రాత్రనకా, పగలనకా కరోనాను తరిమి కొట్టడానికి పనిచేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం బాధ్యతను మరచి, ప్రభుత్వ నిబంధనలకు మరచి రోడ్లపైకి తిరుగుతున్నారు. దీంతో పోలీసులకు పని భారం మరింత పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా జనతా కర్ఫ్యూ విధించిన రోజు మొదలయిన పోలీసుల బందో బస్తు డూటీలు రోజు రోజుకు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం 21రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో పోలీసుల పై బాధ్యతలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి నడుస్తుండడంతో వారి సెలవులన్నీ రద్దయ్యాయి.

కాగా డిపార్ట్ మెంటులో ఉన్న కొంత మంది ఉన్నతాధికారులు కనీసం రోజుకు ఒక్కసారైనా వారి ఇండ్లకు వెల్లి వస్తున్నారు కావొచ్చు కానీ, కానిస్టేబుళ్లు మాత్రం వారి ఇండ్లకు వెళ్లి నాలుగురోజులవుతుంది. వారి భార్యా పిల్లలతో, తల్లిదండ్రులతో కనీసం 5 నిమిషాలు గడపకుండా అయిపోతుంది. నాలుగు రోజుల నుంచి రోడ్లపైనే ప్రజల రాకను నియంత్రిస్తూ డ్యూటీలోనే ఉండడంతో వారు స్నానం కూడా చేయలేని పరిస్తితిలో ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసుల ఆరోగ్యంసై ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి పాప తన నాన్న కోసం ఫ్లకార్డు పట్టుకుని కూర్చుంది. ఆ కార్డులో ఏం రాసుందంటే " మానాన్న ఒక పోలీస్ ఆయన మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉన్నాడు...మీరు ఆయనకు సహాయం చేయడానికి దయచేసి ఇంట్లోనే ఉండండి " అంటూ ఉంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్ గా మారింది. ఇలాంటివే ఇంకా కొన్ని ఫోటోలను చాలామంది డీజీపీ ట్విట్టర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేస్తున్నారు. దీంతో డీజీపీ ప్రజలకు రోడ్లపైకి రాకుండా పోలీసులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. కరోనాను తరిమి కొట్టే యుద్ధంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి ప్రతి ఒక్కరు సహకరించాలని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories