సోషల్ మీడియా యాప్ లపై మొదటి సారిగా కేసులు నమోదు..

సోషల్ మీడియా యాప్ లపై మొదటి సారిగా కేసులు నమోదు..
x
Highlights

స్మార్ట్ ఫోన్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా సోషయ్ మీడియా యాప్ ల సంఖ్య కూడా పెరగిపోతున్నాయి. ఈ యాప్ ద్వారా ఎంతో మంది యువత వాటికి బానిసలై పోతున్నారు.

స్మార్ట్ ఫోన్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా సోషయ్ మీడియా యాప్ ల సంఖ్య కూడా పెరగిపోతున్నాయి. ఈ యాప్ ద్వారా ఎంతో మంది యువత వాటికి బానిసలై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్ యాప్‌లపై జర్నలిస్టు శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కాగా దేశంలోనే మొట్టమొదటి సారిగా సోషల్ యాప్ లపై కేసు నమోదయింది.

ఇక పోతే గడిచిన ఏడాది డిసెంబర్ 12వ తేదీన భారత పార్లమెంట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో దేశ ధిక్కార వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితంలేదు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్లు తిరిగినా వారు పట్టించుకోక పోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సోషల్ మీడియాలో వివాదాస్పదమైన వీడియోలను చాలా మంది పోస్ట్ చేస్తున్నాని దాని ద్వారా దేశ శాంతి భద్రతలకు నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ నేపధ్యంలోనే యాప్‌లను నియంత్రించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని క్షణాల్లోనే 'సోషల్ మీడియా గ్రూప్స్‌లో ప్రచారం చేస్తున్నారని, వాటిలో సున్నితమైన, మతపరమైన అంశాలలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.

సోషల్ మీడియాలో ఆ విషయాలపై చేసే ప్రచారాల కారణంగా ప్రజలు రెచ్చిపోతున్నారని దీంతో మత విద్వేశాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా కొన్ని వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్‌ల పోస్టింగులను జతచేశారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని వాటిని వెంటనే పరిశీలించాలని నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పోతే కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం (ఫిబ్రవరి 27) ఎఫ్ఐఆర్ (374/2020) నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A, 121A, 124, 124A, 294, 295A, 505, 120B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A కింద సోషల్ మీడియా యాప్‌లు ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్‌పై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories