ఎగుమతి, దిగుమతులపై మార్పులు...

ఎగుమతి, దిగుమతులపై మార్పులు...
x
Imports and Exports
Highlights

భారత దేశంలో వినియోగించే వస్తువుల్లో చాలా రకం వస్తువులు విదేశాల నుంచి దిగుమతులు అవుతుంటాయి.

భారత దేశంలో వినియోగించే వస్తువుల్లో చాలా రకం వస్తువులు విదేశాల నుంచి దిగుమతులు అవుతుంటాయి. అలాగే విదేశాలకు భారత్ నుంచి ఎగుమతులు అవుతుంటాయి. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ మార్పులకు గురవుతున్నాయి. దానికి అనుగుణంగాను తమ పనితీరును మార్చుకుంటున్నాయి కస్టమ్స్‌ విభాగాలు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐటీసీ) ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందక ముందు కస్టమ్స్ నిర్వహించిన విధులకు, ప్రస్తుతం ఇప్పుడు నిర్వహిస్తున్న విధులకు చాలా తేడాలు ఉన్నాయి.

అలా విధులను మార్పు చేయడానికి కస్టమ్స్‌ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలానికి అనుగుణంగా ఎగుమతులు దిగుమతుల్లో నిషేధాన్ని విధించి నప్పటికీ కొన్ని అవసరమైన వస్తువును మాత్రమే దిగుమతులు చేస్తుంది. దేశంలో ఎక్కడా సప్లై చైన్‌ ఆగకూడదనే అంశానికి ప్రాధాన్యమిస్తున్న కస్టమ్స్‌ అధికారులు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఆదేశాలతో విధులు నిర్వర్తిస్తున్నారని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. ఇక దిగుమతుల్లో ముఖ్యంగా కస్టమ్స్‌ విభాగమే కీలకపాత్ర వహిస్తోంది.

కరోనా ఎఫెక్ట్‌ తర్వాత నగరానికి వెంటిలేటర్ల దిగుమతి జరుగుతుండడంతో కంటైనర్‌ డిపో(ఐసీడీ) అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా నుంచి రోజుకు 100 నుంచి 150 వరకు మాత్రమే వెంటిలేటర్లు వస్తున్నాయని, వాటి అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. మరో వైపు కేంద్రం మందులు తయారికి అవసరమైన పారాసిటమాల్, టినిడజోల్, మెట్రోనిడజోల్, విటమిన్‌–బి, ఎరిత్రోమైసిన్, నియోమైసిన్, ఒరినిడజోల్‌ లాంటి 26 రకాల రసాయనాల ఎగుమతుల్ని నిషేధించింది. మళ్లీ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది కేంద్రం.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories