శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు..
x
Highlights

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు పొంచి ఉంది. హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం వాహన దారులపాలిట శాపంగా మారే ప్రమాదముంది. పిల్లర్‌...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కు భారీ ముప్పు పొంచి ఉంది. హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం వాహన దారులపాలిట శాపంగా మారే ప్రమాదముంది. పిల్లర్‌ నంబర్‌ 20కు సంబంధించిన వయాడక్ట్‌ పెచ్చులూడుతోంది. నిత్యం వేలాది వాహనాలు ఈ పిల్లర్‌ కింద నుంచే ప్రయాణిస్తుంటారు. పొరపాటున ఏదైనా జరిగితే భారీ ప్రమాదం జరగొచ్చు.

హైదరాబాద్‌కి మణిహారమైన పివిఎన్ఆర్ హైవేకి ముప్పు పొంచి ఉంది. మొత్తం 11.6 కిలోమీటర్ల మేర 600 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇది 2009 అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పదేళ్లలో హైవే మెయింటెనెన్స్‌ను అధికారులు గాలికొదిలేశారు.

మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేందుకు కార్లు, ప్రైవేటు క్యాబ్‌లతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో పిల్లర్‌ 20కి సంబంధించిన వయాడక్ట్‌ పెచ్చులూడుతోంది. అయినా హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. గత వేసవిలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల కోసం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. కానీ ఆ సమయంలో పగుళ్లకు సంబంధించి ఏ మాత్రం పట్టించుకోలేదు. కొద్ది రోజుల క్రితం అమీర్‌పేట్‌ మెట్రో పెచ్చులూడి ఓ మహిళ మృతి చెందడంతో ఇప్పుడీ చర్చ మొదలైంది.

పివిఎన్ఆర్‌కు వచ్చిన పగుళ్లుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఇక్కడి నుండి వేలాది వాహనాలు వెళుతుంటాయని, రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి పగుళ్లు స్పష్టంగా కనిపించినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెహదీపట్నం రోడ్డుపై ఇలాంటి సంఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories