మున్సిపల్ ఎన్నికల్లో కారుదే జోరు!

మున్సిపల్ ఎన్నికల్లో కారుదే జోరు!
x
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్న ధీమాతో అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ 'కారు' జోరు కొనసాగుతుందని సీపీఎస్ సర్వే...

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్న ధీమాతో అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ 'కారు' జోరు కొనసాగుతుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ 104 నుంచి 109 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ 0 నుంచి 4 స్థానాలను గెలుచుకోవచ్చని, బీజేపీకి 0 నుంచి 2 స్థానాలు దక్కుతాయని, ఎంఐఎం పార్టీ 1 లేదా 2 స్థానాలు దక్కుతాయని ఆ సర్వే అభిప్రాయపడింది.

ఇక 7 నుంచి 10 మున్సిపాలిటీల్లో హోరాహోరీ పోటీ ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక శుక్రవారం (జనవరి 24) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ పూర్తైన నేపథ్యంలో సీపీఎస్ సర్వేను విడుదల చేశారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సీపీఎస్ చేసిన సర్వే ఫలితాలు దాదాపుగా నిజం కావడంతో ఈ సర్వేకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఓట్ల లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒకవేళ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.

ఇక మున్సిపల్ పోరులో కారు జోరు కొనసాగుతుందని మొదటి నుంచి గులాబీ దళం ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలన్ని 115 మున్సిపాలిటీలతో పాటు పది కార్పొరేషన్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వస్తాయంటూ వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ అభ్యర్ధులను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించుకున్నారు. అయితే ఎవరిని మేయర్లు, ఎరిని చైర్మన్లుగా ఎంపిక చేయాలనే దానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్లలో పేర్లు పంపించాలని నిర్ణయించినట్లు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories