logo

సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన

సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన
Highlights

పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను సంతలో...

పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరిగా కొంటున్నారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఆపాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపితే సిగ్గులేకుండా పార్టీలు మారుతున్నారని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. కేసీఆర్, అమిత్‌షా, మోడీ కలిసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రతిప‌క్షం లేకుంటే ప్రజలే ప్రతిపక్షంగా మారతారని హెచ్చరించారు సీపీఐ నేతలు. పదవులను అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు ఏదైనా అమ్ముకునే సమర్థులు అమ్ముడపోయిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులారా తస్మాస్‌ జాగ్రత్త అని బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ వేలాదిమంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా తయారవుతారని అన్నారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం వంటింటి కుందేలంటూ ఆయన వ్యాఖ్యానించారు.


లైవ్ టీవి


Share it
Top