Coronavirus: కోవిడ్‌ ను జయించిన హైదరాబాది..

Coronavirus: కోవిడ్‌ ను జయించిన హైదరాబాది..
x
Gandhi hospital (File Photo)
Highlights

ఎంతో మంది ప్రాణాలకు బలితీసుకున్న కరోనా వైరస్ బారిన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు కూడా పడ్డాడు. ఎప్పుడైతే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలిందో

ఎంతో మంది ప్రాణాలకు బలితీసుకున్న కరోనా వైరస్ బారిన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు కూడా పడ్డాడు. ఎప్పుడైతే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలిందో అప్పటి నుంచి అతనికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో 14 రోజుల పాటు ఉంచి వైద్యులు చికిత్సను అందించారు. కాగా ఆ యువకుడు కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకుని ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా రావడంతో గాంధీ వైద్యులు అతడిని శుక్రవారం (మార్చి 13) డిశ్చార్జ్ చేశారు. దేశంలో కరోనా కలకలం రేపుతున్న వేళ తెలంగాణ వాసులకు ఒక రకంగా ఇది శుభవార్తే.

ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వచ్చిన వారందూ చనిపోయే పరిస్థితి ఉండదని వివరించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ ఆ వైరస్ తిరగబెట్టే ప్రమాదం చాలా తక్కువ అని ఆయన స్పష్టం చేసారు.

దుబాయ్ నుంచి వచ్చిన మహేంద్రహిల్స్‌కు చెందిన ఓ యువకుడు కోవిడ్‌ లక్షణాలతో ఈ నెల 1న గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చేరాడు. వైద్యులు అతనికి నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతొ తెలంగాణ ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. అతడికి 9 రోజుల పాటు చికిత్స అందించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడు దుబాయ్ వెళ్లి ఫిబ్రవరి 19న తిరిగి బెంగళూరు వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్ కు ఫిబ్రవరి 22న బస్సులో వచ్చాడు. అప్పటి నుంచి ఆ యువకుడికి జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కలగడంతో అతను వెంటనే సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి వెల్లి అక్కడ చికిత్స తీసుకున్నాడు. అయినా ఆ వ్యక్తి గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాడు. కాగా అతనికి కరోనా సోకిందనే అనుమానంతో వైద్యుడు అతడి నమూనాలను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి వైద్యులు అతనిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ చికిత్స చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories