భార్య పిటిషన్‌.. భర్త మరణించాడన్న ప్రభుత్వం

భార్య పిటిషన్‌.. భర్త మరణించాడన్న ప్రభుత్వం
x
Highlights

తన భర్తను తనకు అప్పగించాలని కరోనా బాధితుని భార్య ఇటీవల కేటీఆర్ కు ట్వీట్ చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

తన భర్తను తనకు అప్పగించాలని కరోనా బాధితుని భార్య ఇటీవల కేటీఆర్ కు ట్వీట్ చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెలరపైకి వచ్చింది. కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని అప్పటి నుంచి ఇప్పటి వరకు తమకు అతని గురించి వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ బాధితుని భార్య హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను ఏం చేసారో తనకు తెలపాలని, తన భర్తను తనకు అప్పగించాలంటూ వనస్థలిపురానికి చెందిన బాధితుని భార్య హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశించింది. అసలు బాదితుడు బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని వాకబు చేసింది. కాగా ప్రభుత్వం తరఫున వక్కాంతం పుచ్చుకున్న అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కొద్ది రోజుల క్రితమే పరిస్థితి విషమించి కరోనాతో మృతిచెందాడని కోర్టుకు వెల్లడించారు.

ఈ సమాధానంతో అసంతృప్తి చెందిన హై కోర్టు బాధితుడు చనిపోయినపుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అతను మృతిచెందినట్టు కనీసం అతని కుటుంబసభ్యులకో, బంధువులకో ఎందకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్‌ ను శుక్రవారంలోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది.

వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో అధికారులు వారందరినీ గాందీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులందరూ కోలుకుని డిశ్చార్జి కాగా కుటుంబ యజమానికి కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో అతన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. ఆసుపత్రి సిబ్బందిని బాధితుని కుటుంబ సభ్యులు ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వారు స్పందించక పోవడంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ బాధితుని భార్య కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాగయినా ఈ విషయంలో తమకు సాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త మాత్రం కనిపించడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories