క్వారంటైన్ నుంచి తప్పించుకుని పెద్దకర్మకు వెళ్లిన దంపతులు

క్వారంటైన్ నుంచి తప్పించుకుని పెద్దకర్మకు వెళ్లిన దంపతులు
x
Representational Image
Highlights

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వం మాట వినకుండా బయటకు తిరుగుతన్నారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వం మాట వినకుండా బయటకు తిరుగుతన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. వారిలో కొంత మంది వైద్యుల సలహాను పాటించినప్పటికీ కొంత మంది మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ బయటికి వెలుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని చేతిపై ఉన్న స్టాంప్ ను చూసి కొంత మంది వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అదే కోణంలో ఇద్దరు భార్యా భర్తలు హోం క్వారంటైన్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. అంతేకాదు ఆ దంపతులు వారి బంధుల ఇంటికి వెల్లారు.

పూర్తి వివరాల్లోకెళితే కరీంనగర్ కు చెందిన ఇద్దరు ఈ నెల 7వ తేదీన అమెరికా నుంచి కరీంనగర్ కు వచ్చారు. కాగా విమానాశ్రయంలో వారిని స్కాన్ చేసిన అధికారులు వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. కాగా వారు ఈ రోజు వరకూ అధికారుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం వారు అదికారుల ఆదేశాలను కొట్టివేసి ఇంట్లో ఉండకుండా జగిత్యాలలోని బంధువుల ఇంట్లో సంవత్సరీకానికి వెల్లారు. కాగా అక్కడికి వచ్చిన కొంత మంది బంధువులు వారి చేతులపై ఉన్న క్వారంటైన్ ముద్రను గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన జగిత్యాల ఆర్డీవో నరేందర్, సీఐ జయేశ్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేంద్రానికి తరలించారు.

ఇక పోతే తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. ఈ రోజు నమోదయిన కేసుల్లో ఇద్దరు వైద్యులు ఉండడం, అందులో వారిద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. ఈ ఇద్దరు వైద్యులు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే వారికి కూడా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఇక వీరు దోమలగూడ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతవాసులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు.

ఇక కరోనా బారిన పడిన 49 ఏళ్ల మరో వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈయన నగరంలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నివాసముంటున్నారని తెలిపారు. డాక్టర్లయిన భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక పోతే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారానికి 39 ఉండగా, బుధవారం రెండు కేసులు నమోదయి 41కి చేరింది. ఇక ఈ రోజు నమోదయిన కేసులను కలుపుకుంటే 44కు చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories