ఇంటర్ హాల్ టికెట్లలో తప్పుల సవరణ : రేపే ముగింపు

ఇంటర్ హాల్ టికెట్లలో తప్పుల సవరణ : రేపే ముగింపు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా ఉన్నారు. గతేడాది ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అనేక...

తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా ఉన్నారు. గతేడాది ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు ఈ సారి జరగబోయే పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే పరీక్ష ఫీజులు కట్టిన విద్యార్థుల హాల టికెట్లలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకేనే అవకాశం కల్పించింది. www.tsbie.cgg.gov.in సైట్ ద్వారా తప్పులను సరిచేసుకోవచ్చని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియెట్ తెలిపింది. ఈ లోపాలను సవరించుకోవడానికి ఆదివారం వరకు మాత్రమే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచనున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి, తల్లిపేరు, గ్రూప్, మీడియం, సెకండ్‌ లాంగ్వేజ్, పీహెచ్‌ కేటగిరి, సబ్జెక్టులు కట్టిన పరీక్ష ఫీజు వంటి తప్పులు ఏమున్నా విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ పరిశీలించి కళాశాల లాగిన్‌లోకి వెళ్లి తప్పుల వివరాలను పై అధికారులకు తెలియజేస్తారు.

తప్పులను సవరించుకోవాలనుకుంటున్న ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు వారి పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్‌తో ఈ హాల్‌టికెట్‌ సరిచూసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇంటర్ మీడియెట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు వారి ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్‌ నంబర్‌తో సరిచేసుకునే అవకాశం ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories