తెలంగాణ ప్రభుత్వ కరోనా వాట్సాప్ చాట్‌బాట్‌..ఇతరులకు చెప్పండి!

తెలంగాణ ప్రభుత్వ కరోనా వాట్సాప్ చాట్‌బాట్‌..ఇతరులకు చెప్పండి!
x
KTR
Highlights

రాష్ట్రంలో నుంచి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

రాష్ట్రంలో నుంచి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీని ఎంతగానో వాడుకుంటుంది. ఇందులో భాగంగానే మొన్నటికి మొన్ని ఆరోగ్య సేతు యాప్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం వాట్సప్ ఛాట్‌బాట్‌ను ప్రారంభించింది.

ఈ యాప్ ని తెలంగాణ ఐటీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు, హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ఎస్‌బీ టెక్నాలజీస్, వాట్సాప్ అధికారిక వ్యాపార పరిష్కారాల భాగస్వామి మెసెంజర్ పీపుల్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. ఈ ఛాట్ బాట్ యాప్ ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రజలు కరోనా వైరస్ గురించిన సమాచారం తెలుసుకోవానుకుంటే 9000658658 నెంబర్‌పై TS Gov Covid Info పేరుతో ఈ వాట్సప్ ఛాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అంతే కాదు కరోనా వైరస్ కు సంబంధించి ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే దీని ద్వారా తెలుసుకోవచ్చును. ఈ యాప్ ఎలా ఉపయోగించాలంటే +919000658658 నెంబర్‌ను ముందు మొబైల్ లో సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత వాట్సప్ ద్వారా Hi లేదా Hello లేదా Covid అని టైప్ చేసి https://wa.me/919000658658?text=Hi లింక్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్లిక్ చేయాలి. అంతే వెంటనే మీకు కావలసిన సమాయారం వచ్చేస్తుంది. అంతే కాక ఈ యాప్ గురించి ఏమైనా సలహాలు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే [email protected] మెయిల్ ఐడీకి ఇ-మెయిల్ చేయవచ్చు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories