Top
logo

తెలంగాణలో 471కి చేరిన కరోనా కేసులు.. 12 మంది మృతి

తెలంగాణలో 471కి చేరిన కరోనా కేసులు.. 12 మంది మృతిEtela Rajender (File Photo)
Highlights

కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి గురువారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇందులో 385 మంది మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు, వారిని కలిసి వ్యక్తులు ఉన్నారని అన్నారు.

ఇందులో గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఒకరు మృతి చెందారని ఆయన వెల్లడించారు. ఇక కరోనా నుంచి కోలుకొని 45 మంది డిశ్చార్జి అయ్యారని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 60 నుంచి 70 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మర్కజ్‌ కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణా ఉండేదని అయన అభిప్రాయపడ్డారు.

Web TitleCoronavirus Updates in Telangana 18 Corona Positive cases Noticed Today
Next Story