మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..
x
Representational Image
Highlights

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో శనివారం రోజున జిల్లాలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఇప్పటి వరకు జిల్లాలో నమోదయిన కుసుల సంఖ్య 27కు చేరింది. వీరంతా ఈ నెల 12 న మహారాష్ట్ర నుంచి తమ సొంత ఊళ్లకు వచ్చిన వారుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో జన్నారం మండలం కిష్టాపూర్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా, రోటికనిగూడకు చెందిన వారు ఇద్దరు. కాగా వీరందరిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో కరోనా వచ్చిన 27 మంది ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లి లాక్ డౌన్ నేపధ్యంలో ఇటీవల సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం.

ఇకపోతే కరోనాపై తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ న్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 62 పాజిటివ్ కేసులు నమోదు కాగా. ముగ్గురు మృతి చెందారు. దాంతో నిన్నటి వరకు మొత్తం 48 మంది మృతి చెందారు. నిన్న నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక్కటి. మరో19పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చాయి. తెలంగాణ లో నిన్నటి వరకు 1761 కేసులు నమోదు అయ్యాయి. నిన్న 7 గురు డిశ్చార్జి అయ్యారు దాంతో నిన్నటి వరకు 1043 మంది డిశ్చార్జి అయినట్టయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories