ఆ 40 మందికి కరోనా నెగిటివ్... ఊపిరి పీల్చుకున్న జిల్లా వాసులు

ఆ 40 మందికి కరోనా నెగిటివ్... ఊపిరి పీల్చుకున్న జిల్లా వాసులు
x
Representational image
Highlights

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్త‌రావు ప‌ల్లి గ్రామానికి చెందిన 62 ఏళ్ల ఓ మహిళ కరోనా లక్షణాలతో ఇటీవ‌ల మృతి చెందిన విషయం తెలిసిందే.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్త‌రావు ప‌ల్లి గ్రామానికి చెందిన 62 ఏళ్ల ఓ మహిళ కరోనా లక్షణాలతో ఇటీవ‌ల మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా కింగ్ కోఠి హాస్పిటల్ వైద్యులు ఆమె మరణించిన తరువాత మృత దేహంనుంచి శాంపిల్స్ ను తీసుకుని టెస్టులకు పంపించారు. ఆ రిపోర్టుల్లో ఆమెకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధారణం అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై కంటైన్మెంట్ జోన్ గా గ్రామాన్ని ప్ర‌క‌టించారు. ఈ గ్రామంలోకి ఇతర పల్లెలవారు ఎవరూ రాకుండా, ముత్తరావు పల్లి గ్రామస్తులు బయటికి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

కాగా మందమర్రి క్వారంటైన్ లో మృతి చెందిన మహిళతో ఫ‌స్ట్ కాంటాక్ట్‌, ప్రైమ‌రీ కాంటాక్ట్ ఉన్న బంధువులు, గ్రామస్థలు 40 మందిని ఉంచారు. వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. కాగా ఆ 40 మందికి కరోనా నెగిటివ్ ఉన్నట్లుగా మంగళవారం వచ్చిన రిపోర్టుల్లో వెళ్లడి అయిందని అధికారులు తెలిపారు. దీంతో క్వారంటైన్ లో ఉన్న వారు మాత్రమే కాకుండా మంచిర్యాల జిల్లా వాసులంతా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా వీరందరి నుంచి మరో సారి శాంపిల్స్ ని తీసుకుని ప‌రీక్ష‌లు నిర్వహిస్తామని అధికారులు తెలపారు. అయినప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories