ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
x
Representational Image
Highlights

ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో స్వీయ నియంత్రణ వైపు అడుగులు వేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాసులు. ఎవరికి వారే సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విధించుకున్నారు. సమిష్టిగా కరోనాను తరిమికొట్టేందుకు పూనుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసులు పెరిగిపోవటంతో జిల్లాలోని న్ని ప్రాంతాల్లో జనం సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్‌లో ఇప్పటికే 20 కేసులు వచ్చాయి. ఇందులో జనం ఎక్కువగా తిరిగే బ్యాంకులు..కిరాణా దుకాణాల్లో ఉన్నవారే అధికంగా ఉండటంతో వ్యాపారులు లాక్ డౌన్ విధించుకున్నారు. కేవలం కొంత సమయం మాత్రమే వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో ప్రాంతం సుల్తానాబాద్. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 15 కేసులు ఉండగా...అందులో సుల్తానాబాద్ ప్రాంతంలోనే 7 కేసులు ఉన్నాయి. సుల్తానాబాద్ ఎమ్మార్వో కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు వీఆర్వోలకు, వారి కుటుంబసభ్యులకు పాజిటివ్ వచ్చింది. దీంతో సుల్తానాబాద్ తహశీల్దార్‌ కార్యాలయంలోని 17 మందిని హోం క్వారంటైన్ కావాలని జిల్లా కలెక్టర్ అదేశాలు ఇచ్చారు. ఇలా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే దుకాణ సముదాయాలు తెరిచి ఉంచాలని నిర్ణయించున్నారు. ఆ తర్వాత అందరూ ఇళ్లోనే ఉండాలని తీర్మానించుకున్నారు.

ఇక సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఆ జిల్లాలోని గంభీరావుపేట.. ముస్తాబాద్ మండలాల్లో మూడు నాలుగురోజుల పాటు పూర్తిస్దాయిలో లాక్ డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. దీంతో గంభీరావు పేటలో లాక్‌డౌన్‌ను పాటించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories