యాదాద్రి జిల్లాలో న‌లుగురికి కరోనా పాజిటివ్‌!

యాదాద్రి జిల్లాలో న‌లుగురికి కరోనా పాజిటివ్‌!
x
Representational Image
Highlights

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేని జిల్లాగా గ్రీన్ జోన్ లో కొనసాగుతున్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేని జిల్లాగా గ్రీన్ జోన్ లో కొనసాగుతున్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఆత్మకూరు (ఎం) మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు క‌లెక్టర్‌ వెల్లడించారు. అయితే వారంతా ముంబై నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వారిని క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా నాలుగు కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది

ఇక తెలంగాణలో శనివారం నాటికీ కేసుల సంఖ్యా చుస్తే... గత కొన్నిరోజుల నుంచి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతూ వస్తున్న కరోనా కేసులు నిన్న పెరిగాయి. నిన్న ఏకంగా రాష్ట్రంలో 31 కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 30 కేసులు GHMC పరిధిలోవి కాగా, మరొకటి వలస కార్మికుడికి సోకింది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1163కి చేరింది. ఇక ప్రస్తుతం 382 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి కోలుకుని 751 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక అటు కరోనాతో పోరాడి రాష్ట్రంలో 30 మంది మరణించారు. ఇక కరోనా కట్టడికి గాను తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories