తెలంగాణలో ఇంటి వద్దే కరోనా వైద్యం.. ఐసీఎమ్మార్‌ గైడ్‌లైన్స్‌తో మారిన పరిస్థితి

తెలంగాణలో ఇంటి వద్దే కరోనా వైద్యం.. ఐసీఎమ్మార్‌ గైడ్‌లైన్స్‌తో మారిన పరిస్థితి
x
Representational Image
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మనవాళికి నరకం చూపిస్తోంది. ఎవ్వరికి అంతు చిక్కని ఈ వ్యాధితో ఏం చేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది....

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మనవాళికి నరకం చూపిస్తోంది. ఎవ్వరికి అంతు చిక్కని ఈ వ్యాధితో ఏం చేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా లక్షణాలు ఉన్న రోగులకైనా.. లేదా లక్షణాలు కనిపించని రోగులకైనా ఇంటి వద్దే చికిత్స అందించాలని నిర్ణయించింది.

కరోనా అంటే దూరం దూరం అన్నారు. ఒకరికి వస్తే.. వాళ్ల గల్లీలోకి పోలేదు ఎవరు. అంతేకాదు బాధితులనుగాంధీకి తరలించి ఆ ఏరియాను శానిటేషన్‌ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కరోనా బాధితులను అంటరానివారిగా ట్రీట్‌ చేశారు. కానీ కొత్తగా ఐసీఎమ్మార్‌ ఇచ్చిన గైడ్‌లైన్స్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది.

లక్షణాలులేని కరోనా పాజిటివ్‌ పేషంట్లకు ఇళ్లలోనే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇళ్లే కదా అని ఎలా పడితే అలా అంటే కుదరదు. కండిషన్స్‌ మాత్రం తప్పని సరి అంటున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు ఇంటి దగ్గరే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సదరు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది రోగులకు హోం ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. వీరంత 17 రోజులు ఇంటి దగ్గరే ఉంటూ వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకుంటున్నారు.

35 రోజులు గడిచిన తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్‌ వస్తందని అలాంటి వారి కోసం హోం క్వారంటైన్‌ చేస్తున్నామన్నారు మంత్రి ఈటెల. లక్షణాలు లేని ఆస్పత్రిలో చికిత్స పొందితే... ఇతర ఇన్ఫెక్షన్‌లు సొకే ప్రమాదం ఉండటంతో ఇంటి వైద్యానికే ఓటేస్తున్నామన్నారు. ఇంటి దగ్గర ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వారికి ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల ద్వారా చికిత్స అందిస్తామంటున్నారు మంత్రి ఈటెల

ఇక కోవిడ్‌ రోగి వీలైనంత వరకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదితో పాటు ప్రత్యేక మరుగుదొడ్డి వాడిలే చూసుకోవాలి. ఆరోగ్యవంతులైన కుటుంబసభ్యులతో సేవలు అందించుకోవడంతో పాటు మంచం నుంచి దిగినా, గది బయటకు వచ్చినా మాస్క్‌ తప్పని సరిగా ధరించాలి. దగ్గినపుడు, తుమ్మినపుడు రుమాలు, టిష్యూపేపర్‌ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని కాల్చేయడం లేదా చెత్తబుట్టలో పడేయాలి. రోజుకి కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగడంతో పాటు టాయిలెట్ క‌ు వెళ్లేముందు, తరవాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. అంతేకాక చేతితో తాకిన వస్తువుల్ని సబ్బుతో శుభ్రం చేయాలి.

కరోనా బాధితుడి ఇంట్లో 55ఏళ్ల పైబడిన వ్యక్తులు, గర్భిణి, క్యాన్సర్‌, ఆస్తమా, శ్వాసకోశ, మధుమేహం, బీపీ, గుండెజబ్బు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు, చిన్న పిల్లలు ఉంటే బాధితుడు కోలుకునే వరకు వారిని వేరే చోటుకి తరలించాలంటున్నారు వైద్యులు. బ్రౌన్‌రైస్‌, గోధుమపిండి, ఓట్స్‌, చిరుధాన్యాలు తీసుకోవాలి. బీన్స్‌ చిక్కుడు, పప్పు ధాన్యాలతో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ లభిస్తుంది.నిమ్మ, బత్తాయితో సీ విటమిన్‌ లభిస్తుందని తెలిపారు. ఆహారంలో మసాల వస్తువులైన అల్లం, వెల్లుల్లి, పసుపుతో పాటు పాలు, ఎగ్‌ ఎక్కువగా తీసుకోవడంతో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయంటున్నారు.

అనుమానిత, నిర్ధారించిన బాధితుడు వైద్యుడి సలహా మేరకు మాత్రలు వాడటంతో పాటు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అదే సమయంలో ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories