ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభం

ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభం
x
Representational image
Highlights

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.vముందుగా ఆస్పత్రిలో ట్రయల్‌ కింద 22 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో కేవలం ఐసోలేటెడ్‌ వార్డు మాత్రమే ఉందని, కరోనా అనుమానిత కేసులను మాత్రమే ఇక్కడ అనుమతించి ఉంచేవారని తెలిపారు. రోగులకు మాత్రమే ఈ వార్డులో పెట్టి వారి నుంచి నమూనాలకు సేకరించి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పంపించి పరీక్షలు నిర్వహించేవారని తెలిపారు. అక్కడ రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చినట్టయితే రోగులకు ఎర్రగడ్డలోని ఛాతి వైద్యశాలకు పంపించేవారు. ఆ తరువాత పేషంటుకు చికిత్స మొదలుపెట్టేవారని తెలిపారు. కానీ బుధవారం నుంచి ఫీవర్ ఆస్పత్రిలోనే పరీక్షలు మొదలయ్యాయి కాబట్టి ఎక్కువగా సమయం వృద్ధా కాకుండా రోగులకు చికిత్స అందించడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

ఇక వరంగల్ లోనూ కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతులకు ఇచ్చింది. వరంగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, వరంగల్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజిఎం), నిజాం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కు అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఈ కేంద్రాలను ప్రారంభించలేదు. కరోనావైరస్ పరీక్ష కోసం సిసిఎంబి, డిఎఫ్డి సేవల గురించి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరగా శనివారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories