కరోనా వైరస్ సోకిన వారిలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా చనిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా...

కరోనా వైరస్ సోకిన వారిలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా చనిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా...
x
Representational Image
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు మార్చి నెలలో నమోదయింది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య పెరిగిపోతూ 766కు చేరుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు మార్చి నెలలో నమోదయింది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య పెరిగిపోతూ 766కు చేరుకుంది.వారిలో 186మంది ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి కాగా మరో 18మంది చనిపోయారు. కాగా వారిలో సుమారుగా180 మంది దాకా ఆడపిల్లలు, మహిళలు ఉన్నారు. వారిలో 17 మంది 60 ఏళ్ల దాటిన వారే ఉన్నారు. వారిలో ఐదుగురు మహిళలు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, మిగతావారు తబ్లీఘీ జమాత్ కి వెల్లివచ్చినవారు ఉన్నారు. మిగతా మహిళలకు వారి వారి కుటుంబ సభ్యుల నుంచే కరోనా వైరస్ సోకింది.

కరోనా బాధిత మహిళలు, బాలికల వయస్సు సుమారుగా 13 నుంచి 60 మధ్య ఉండడంత వలన వారికి రోగ్ నిరోధక శక్తి ఎక్కవగా ఉంటుంది. దీంతో వారు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతే కాక కరోనా బాధిత మహిళల్లో 16 మంది బాలికలు 12 ఏళ్ల వయసు లోపు గలవారు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిలో పురుషులతో పోల్చితే చాలా వరకు మహిళలు త్వరగా కరోనా వ్యాధినుంచి బయటపడడానికి కారణం ఇదే.

ఇక కరోనా వ్యాధితో చనిపోయిన మహిళల్లో 60ఏండ్లు దాటిన వారే ఇద్దరు ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయిన వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ విషయంపై కొంత మంది పరిశోధనలు చేసి కొన్ని నిజాలు బయటపెట్టారు. పురుషుల కంటే మహిళల్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయని, పురుషుల్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయని తెలిపారు. మహిళల్లో X క్రోమోజోమ్ అదనంగా ఉండడం వలన వారికి రోగ నిరోధక శక్తి ఉంటుందని, వారు కరోనా వైరస్‌ని ఎక్కువగా ఎదుర్కోగలుగుతున్నారనీ తెలిపారు. పురుషులకు Y క్రోమోజోమ్ ఉండడం వలన వారు ఈ వైరస్ ను ఎక్కువగా తట్టుకోలేక చనిపోతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories