గాంధీలో తొలి ప్లాస్మా దాత ఎవరో తెలుసా?

గాంధీలో తొలి ప్లాస్మా దాత ఎవరో తెలుసా?
x
covid-19 recovered man Donated Blood for Plasma Therapy
Highlights

ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ గత మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ గత మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ ని కనిపెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ వినియోగంలోకి రాలేదు. దీంతో వైరస్ బారిన పడిన వారికి కొన్ని ఆస్పత్రుల్లో ఫ్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్లాస్మాధెరపీ కూడా ఆశాజనకమైన పనితీరును కనబరుస్తుంది. దీంతో గాంధీ ఆస్పత్రిలోనూ ప్లాస్మా థెరపీ చికిత్సా విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలు ఐసీఎంఆర్ అనుమతి కోరారు.

ఈ ప్లాస్మా థెరపీ విధానం పూర్తిగా అమలులోకి రానప్పటికీ, ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ కరోనా భాధితుల పరిస్థితిని బట్టి ప్లాస్మా థెరపీని వాడొచ్చని ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే గాంధీ హాస్పిటల్‌లోనూ ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. కాగా ఫ్లాస్మాను డోనేట్ చేయడానికి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఎంతో మంది వ్యక్తులు ముందుకొచ్చారు. కానీ వరంగల్‌కు చెందిన అఖిల్ (24) అనే యువకుడి నుంచి వైద్యులు మొట్టమొదటి ప్లాస్మాను తీసుకున్నారు.

ఈ యువకుడు బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతను లాక్ డౌన్ కి ముందు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి రాగా అతన్ని క్వారంటైన్ కి పంపించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా అతనికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీకి తరలించి 14 రోజులు చికిత్స అందించారు. దీంతో అతడు వైరస్ బారినుంచి కోలుకున్నాడు. కాగా కరోనా నుంచి కోలుకున్న అఖిల్ తన వల్ల ఇంకొకరి ప్రాణాలు నిలబడుతున్నాయంటే.. అంతకు మించి ఆనందం కలిగించే విషయం మరొకటి లేదని అఖిల్ ప్లాస్మాను దానం చేసాడు. ఈ ప్లాస్మా థెరపీలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన బ్లడ్ ప్లాస్మాను కరోనాతో బాధపడుతున్న వారికి ఎక్కిస్తారు. ఇలా చేస్తే కరోనా బాధితుని శరీరంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి సరిపడా యాంటీబాడీస్ రూపొందుతాయని పరిశోధకులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories