రెండు కుటుంబాలకు కరోనా.. 400 మందితో సంబంధాలు

రెండు కుటుంబాలకు కరోనా.. 400 మందితో సంబంధాలు
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ భారతదేశంతో సహా 150 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ భారతదేశంతో సహా 150 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలెవరూ బయటికి రాకుండా లాక్ డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పట్టణాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి కరోనా అనుమానితులని క్వారంటైన్ లో ఉంచుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీపై దృష్టి పెట్టింది.

నిజాం ప్రభుత్వ హయాంలో దిల్లీలో నిర్మించిన ఓ ప్రార్థనా మందిరానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన రెండు కుటుంబాల వారు వెళ్లి వచ్చారు. అనంతరం వారు రాగానే అధికారులు వారికి పరీక్షించి సోకినట్లుగా గుర్తించారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమయింది. అధికారులు ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దించి ఆ కుటుంబానికి చెందిన వారు ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరెవరిని కలిశారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణంలో ఆ కుటుంబంవారు సుమారుగా 400 మందిని కలిసినట్లుగా అధికారులు తెలిపారు. ఆయా కుటుంబాల వారి వద్దకు వెల్లి వారిని పరీక్షించి వారిని హోం క్వారంటైన్‌ చేస్తున్నారు.

ఇక పోతే ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా తీసుకుని ఆయనే ఓల్డ్ సిటీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓల్డ్ సిటీలో మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలుతున్నారు. ఆయనతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఈటల ఓల్డ్ సిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీరు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీతో మాట్లాడారు. పాతనగరంలో కరోనా కట్టడికి వారు కూడా చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ కోణంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెలింగ్ మధ్యవర్తిని అధికారులు అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories