ఒకే ఇంట్లో 16 మందికి పాజిటివ్..ఆదమరిస్తే ఆగమాగమే

ఒకే ఇంట్లో 16 మందికి పాజిటివ్..ఆదమరిస్తే ఆగమాగమే
x
Highlights

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. నిన్న మొన్నటి వరకు కుటుంబంలో ఒకరికి సోకిన వైరస్ ప్రస్తుతం ఇళ్లకు ఇళ్లనే చుట్టేస్తుంది.

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. నిన్న మొన్నటి వరకు కుటుంబంలో ఒకరికి సోకిన వైరస్ ప్రస్తుతం ఇళ్లకు ఇళ్లనే చుట్టేస్తుంది. దీంతొ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్న ఒక్కరోజే 55 కేసులు నమోదు కాగా, మొన్న 42 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 37 కేసులు GHMC పరిధిలోనివని గుర్తించారు.

చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వారి నుంచి కుటుంబసభ్యులకు కూడా సోకుతుంది. ఈ నేపధ్యంలోనే మంగళ్‌హాట్‌లో ఓ యువకుడి ద్వారా ఇంట్లోని 16 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఆ యువకుడి కుటుంబంలో మొత్తంగా 27 మంది ఉన్నారు. వారిలో 8మంది చిన్నారులకు, 8 మంది పెద్దవారికి కరోనా వైరస్ సోకింది. కాగా వారిలో ఇంటి యజమాని చికిత్స పొందుతూ మరణించాడు.

కాగా మొన్నటి కి మొన్న ఓ అపార్ట్ మెంట్ లో బర్తడే పార్టీకు హాజరైన వారిలో 23 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. అంతే కాక కరోనా వైరస్ సోకిన ఓ మహిళ బ్యాంకుకు వెళ్లగా బ్యాంకు సిబ్బంధిని కూడా క్వారంటైన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 525 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. అందులో నిన్న ఒక్కరోజే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 34 మంది చనిపోయారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories