కరీంనగర్ జిల్లాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

కరీంనగర్ జిల్లాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌
x
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో కరోనా ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సెంచరీ దాటాయి. దీంతో కరీంనగర్ లో ఇళ్లలోనే...

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో కరోనా ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సెంచరీ దాటాయి. దీంతో కరీంనగర్ లో ఇళ్లలోనే ఇకపై కరోనా నిర్ధారణ తో పాటు చికిత్స కూడా అందించాలని నిర్ణయించింది వైద్య శాఖ.

ఇండియా లో ఒకేసారి పది కరోనా పాజిటివ్ కేసులు వచ్చి మార్చి నెలలోనే సంచనలంగా మారింది కరీంనగర్ అయితే ఆ తరువాత లాక్ డౌన్ విధించడం వల్ల కేసుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ విజృంభిస్తోంది. నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రాంతమైన కరీంనగర్ జిల్లా లో ప్రస్తుతం 119 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం లో అత్యధికంగా 71 కరీంనగర్ జిల్లాలో 26 ,సిరిసిల్ల లో 17..,పెద్దపల్లి లో 5 కేసులు నమోదు అయ్యాయి. ఇదే ముంబై నుండి వచ్చిన వలస కార్మికులకు వరుసగా పాజిటివ్ రావడం తో పాటు స్థానికులకి కూడా వారితో పాజిటివ్ వచ్చింది.

మరో వైపు మరణాల సంఖ్య కూడా జిల్లాలో కలవరం పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 119 కేసుల్లో ఇప్పటి వరకు 7 గురు చనిపోయారు. సోమవారం ఒక్కరోజే ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు ఇలా రోజు రోజుకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా టెన్షన్ పెరిగిపోతూనే ఉంది. పెరుగుతున్న కేసులతో కరీంనగర్ లోనే ఇకపై కరోనా లక్షణాలు ఉన్నవారికీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. ట్రీట్మెంట్ కూడా పాజిటివ్ వచ్చిన వారి ఇంట్లో చేయడం అక్కడ సరైనా వసతి లేకపోతే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో చేసుకునేందుకు ఏరాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఇలా కరోనా విజృంభించడం పై వైద్యశాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబయ్ నుండి సీక్రెట్ గా వచ్చి గ్రామాల్లో ఉంటున్న వారిని వెతికి పట్టుకోవడం వైద్యశాఖ సిబ్బందికి తలనొప్పిగా మారింది. వైధ్యశాఖ లో పని చేస్తున్న ఓ ఉద్యోగినికి కూడా ఇటీవల పాజిటివ్ రావడం తో ఆ శాఖ లో పని చేసే సిబ్బందికి సైతం భయం మొదలైంది. అయితే ఇంతలా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంటే జిల్లాలోని చాల మంది జనం బయటకి వచ్చేప్పుడు లైట్ తీసుకోవడం, గుంపులు గుంపులుగా తిరగడం లాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories