జూలో జంతువులకు ఎలాంటి హాని లేదు

జూలో జంతువులకు ఎలాంటి హాని లేదు
x
Representational Image
Highlights

గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ లక్షణాలు కేవలం మనుషులలో మాత్రమే కాదు జంతువుల్లో కూడా కనిపించడం ప్రారంభం అయ్యాయి.

గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ లక్షణాలు కేవలం మనుషులలో మాత్రమే కాదు జంతువుల్లో కూడా కనిపించడం ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మనుషులకు వైరస్ వస్తేనే ప్రపంచం ఇంత విలవిలలాడుతుంటే, ఇంకా పశువులకు, పక్షులకు కూడా వైరస్ సోకితే పరిస్థితులను అదుపుచేయగలమా అంటూ భయపడుతున్నారు. ఇటీవలే అమెరికా న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ జూలో నాలుగేళ్ల పెద్దపులి (నాదియా)కి కరోనా వైరస్‌ సోకింది. దాంతో పాటుగానే మరో మూడు పులులకు, మూడు ఆఫ్రికా సింహాలకి కూడా పొడి దగ్గు పెరిగి, ఆకలి మందగించాయి. వెంటనే జూ అధికారులు అప్రమత్తం అయి బ్రాంక్స్ జూ తో పాటు న్యూయార్క్‌ నగరంలోని అక్వేరియంలను, మరో మూడు జూలను నిరవధికంగా మూసేశారు.

ఇక ఈ నేపథ్యంలో భారత్‌లోని నేషనల్‌ పార్కులు, జూలు, అభయారణ్యాలు, జింకల పార్కుల్లోని జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని రాష్ట్రాల అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. జంతువులను పర్యవేక్షిస్తూ వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జూ పార్కుల్లో హై అలర్ట్ జారీ చేసారు. జంతువుల ప్రవర్తనను, వాటి ఆరోగ్యంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు. సీసీ ఫుటేజీల్లో 24 గంటల పాటు జంతువులను పరిశీలించాలని తెలిపారు.

ఇక హైదరాబాద్ నగరంలోని జూపార్కుల్లో ఉండే జంతువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నెహ్రూ జూలాజికల్‌ పార్కు క్యూరేటర్‌ క్షితిజ తెలిపారు. జూలో జంతువులన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని స్పష్టం చేసారు. జంతువులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు జంతువుల్లో ఎలాంటి సమస్యలు లేవని ఆమె అన్నారు. జూలో పనిచేసే సిబ్బందికి శానిటైజర్లు అందిస్తున్నామని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories