బాలింతను బలి తీసుకున్న మహమ్మారి

బాలింతను బలి తీసుకున్న మహమ్మారి
x
Representational Image
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు నమోదవ్వడం మాత్రకే కాదు తొలి కరోనా మరణం కూడా చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు నమోదవ్వడం మాత్రకే కాదు తొలి కరోనా మరణం కూడా చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేట మండలానికి చెందిన ఓ బాలింత నెలలు నిండకుండానే హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్‌లో ఓ బాబుకు జన్మనిచ్చింది. కానీ ఆ చిన్నారి పుట్టిన కొద్ది సేపటికే చనిపోగా బాలింత కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

కాగా వైద్యులు ఆమెకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే స్థానిక అధికారులు, వైద్యులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మృతురాలి కుటుంబసభ్యుల్లో మృతురాలి భర్త, ఏడాదిన్నర వయసున్న పాపతోపాటు మరో ఏడుగురు ప్రైమరీ కాంటాక్టులను బీబీనగర్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరితో పాటుగానే ఆమె తల్లిగారి ఊరైన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన 8 మందిని కూడా హోం క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. మృతురాలి భర్తతో కాంటాక్ట్ అయిన 13 మందిని కూడా అధికారులు క్వారంటైన్లో ఉంచారు.

మృతురాలు నివసించిన గ్రామంలోని కాలనీని కూడా కంటైన్మెంట్‌ ఏరియాగా ప్రకటించారు. ఇక పోతే మృతురాలు మే 27వ తేదీన నెలవారీ టెస్టులను జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకుంది. కాగా ఆ ఫలితాల్లో రక్తం తక్కువగా ఉందని వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మృతురాలిని మే 31తేదీన హన్మకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు తెల్ల రక్త కణాలు తక్కువగా ఉన్నాయని చెప్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న మృతురాలు ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాబు జన్మించగా పుట్టిన కాసేపటికే మరణించాడు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories