నిజామాబాద్‌లో కరోనా విజృంభణ.. 47కు చేరిన కేసులు..

నిజామాబాద్‌లో కరోనా విజృంభణ.. 47కు చేరిన కేసులు..
x
Highlights

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వెల్లడించారు. దీంతో...

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వెల్లడించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు 47కు చేరాయి. ఇక్కడ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు ఎక్కువకావడంతో కేసులు సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. 47లో ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 25 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజులుగా జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

172 మందికి చెందిన శాంపిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో 15 కరోనా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆ కాలనీలను పూర్తిగా నిర్బంధించారు. గట్టి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారులు కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్‌ వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories