తెలంగాణ‌లో తీవ్రరూపం దాలుస్తున్న క‌రోనా ప్రకంపనలు..మరో 130మంది కోసం ముమ్మర గాలింపు

తెలంగాణ‌లో తీవ్రరూపం దాలుస్తున్న క‌రోనా ప్రకంపనలు..మరో 130మంది కోసం ముమ్మర గాలింపు
x
Highlights

తెలంగాణలో కరోనా ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 229కి చేరింది. శుక్రవారం ఒక్కరోజో 75 కరోనా పాజిటివ్‌ కేసులు...

తెలంగాణలో కరోనా ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 229కి చేరింది. శుక్రవారం ఒక్కరోజో 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. 32 మంది ఇప్పటికే కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్స్ లో 186 మంది గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 900 మందిని ప్రభుత్వం గుర్తించింది. రెండు రోజుల్లో వారిలోని 800 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారంతా స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఆరు ల్యాబుల్లో 24 గంటల పాటు మూడు షిప్టుల్లో కరోనా పరీక్షలు జరుపుతున్నారు.

మరో 130మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అధికారులు. కరోపాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఏ ప్రాంతాల్లో తిరిగారు ఎంతమందిని కలిశారు అనే అంశాలపై స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు. గుర్తించిన వారందరినీ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరిన 14 మంది నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ల సేవలు మర్చిపోలేనివని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. డాక్టర్ల కృషి వల్లే తాము కోలుకోగలిగామని చెబుతున్నారు. మరోవైపు వీరిని చూసి డాక్టర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను జయించిన వీరిని 14 రోజులు హౌస్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories