నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న కరోనా.. మా ఊరికి రావొద్దంటూ కంచెల ఏర్పాటు..

నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న కరోనా.. మా ఊరికి రావొద్దంటూ కంచెల ఏర్పాటు..
x
Highlights

నిజామాబాద్ జిల్లాను కరోనా రక్ససి వెంటాడుతోంది. పల్లెలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. లాక్ డౌన్ ముగిసినా వైరస్ సెగలు గ్రామాలను...

నిజామాబాద్ జిల్లాను కరోనా రక్ససి వెంటాడుతోంది. పల్లెలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. లాక్ డౌన్ ముగిసినా వైరస్ సెగలు గ్రామాలను పట్టీపీడుస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన గ్రామ కమిటీలు స్వచ్ఛంద లాక్ డౌన్ కు పిలుపునిచ్చాయి. బతికి బట్టకట్టాలంటే కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిందే అంటూ నిశ్చయించుకున్నారు. పొలిమేరల్లో కంచెలను వేసి కొత్తవారిని అడ్డుకుంటున్నారు. ఆర్మూర్, కామారెడ్డి డివిజన్లలోని పల్లెల పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

నిన్నటి వరకు పట్టణాలకు పరిమితమైన కరోనా ఇప్పుడిప్పుడే పల్లెల్లోకి ఎంటర్ అవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పల్లెలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఆర్మూర్ డివిజన్ లో వారం వ్యవధిలోనే 8 మందికి కరోనా సోకింది. ఆర్మూర్ లో తల్లీ కొడుకులకు, మగ్గిడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మోర్తాడ్ లో మరో వ్యక్తికి కరోనా వచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన గ్రామ కమిటీలు 300 మందిని హోం క్వారంటైన్ లో ఉంచారు. గ్రామాల్లో ఆంక్షలు విధిస్తూ స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మగ్గిడి, ఆలూరు, ఫతేపూర్, ఖానాపూర్, దేగాం, అమ్దాపూర్, తదితర గ్రామాల పొలిమేరల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు.

కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో కరోనా తన ఉనికిని చాటుకుంటోంది. చాలా గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కామారెడ్డి, దోమకొండ, రాజాంపేట, గాంధారి గ్రామాల్లో హోటళ్లు, మాంసం దుకాణాలు, క్షౌరశాలలను మూసివేశారు. కామారెడ్డి పట్టణంలో ఈనెల 30 వరకు వ్యాపార -వాణిజ్య సంస్థలు సాయంత్రం 4 గంటల వరకే మూసివేసేలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 వేల జరిమానా విధించనున్నట్లు గాందారిలో గ్రామాభివృద్ధి కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 30 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుంబసభ్యులు ఉండడం గమనార్హం. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి గ్రామాభివృద్ధి కమిటీలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. గ్రామస్తుల నిర్ణయం వైరస్ ను ఎలా నిలువరిస్తోంది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories