లాక్ డౌన్ తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి

లాక్ డౌన్ తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి
x
KCR (File Photo)
Highlights

కరోనా లాక్ డౌన్ సామాన్యులకే కాదు ప్రభుత్వాలను కూడా అప్పుల పాల్జేసింది. లాక్ డౌన్ ఉన్న మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం 12 వేల 461 కోట్ల అప్పులు చేసింది....

కరోనా లాక్ డౌన్ సామాన్యులకే కాదు ప్రభుత్వాలను కూడా అప్పుల పాల్జేసింది. లాక్ డౌన్ ఉన్న మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం 12 వేల 461 కోట్ల అప్పులు చేసింది. లాక్ డౌన్ తో ఆదాయం లేకపోవడంతో పాలన సాగించేందుకు తప్పని పరిస్థితుల్లో అప్పులు తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యమైంది. ఖర్చులు తగ్గింపులో భాగంగా ఉద్యోగుల జీతాలను కూడా సగం వరకు పరిమితం చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్ర ఆధాయం కొద్ది కొద్దిగా కుదుటపడటంతో అటు ఉద్యోగులకు జీతాలు, ఇటు రైతుబంధు నిధులను విడుదల చేస్తోంది సర్కార్.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం లాక్ డౌన్ కారణంగా గండి పడింది. ప్రతి నెలా 12 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కాస్తా కేవలం వంద కోట్లకే పరిమితం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ నెలలో 4 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. దీనికితోడు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 982 కోట్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కల్గింది. ఆ తర్వాత మే నెలలో కూడా మరో 4 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. దీనికి అదనంగా కేంద్రం నుండి పన్నుల రూపంలో మళ్లీ 982 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత జూన్ నెలలో కూడా

మరోసారి 4 వేల 461 కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చింది. అయితే జూన్ నెలలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా ఇంకా అందలేదు. ఇలా ఏప్రిల్, మే, జూన్ తో మూడు నెలలు కలుపుకోని ఒక లక్షా 24 వేల 61 కోట్లకు పైగా అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.కేంద్రం నుంచి ఈ మూడు నెలల్లో ఒక వెయ్యి 964 కోట్ల రూపాయలతో కలిపి 14 వేల 425 కోట్లతో ఈ మూడు నెలలు గట్టెక్కింది రాష్ట్ర ప్రభుత్వం.

లాక్ డౌన్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్నుల రాబడిలో జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ లతోపాటు రాబడులు బాగా మెరుగుపడ్డాయి. అంటే 70 శాతానికి పైగా రాబడులు వచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. పెట్రోలు ద్వారా వచ్చే అమ్మకం పన్ను మినహా మిగిలిన రాబడులు అంచనాల మేరకు ఉన్నాయి. సగటున నెలకు 12 వేల కోట్లు రావాలి. లాక్ డౌన్ సడలింపులతో ఎక్సైజ్, స్టాంపుల రిజిస్ట్రేషన్‌ శాఖల నుంచి రాబడి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అంటే 820 కోట్లు వరకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో 2 వేల కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. దీనికి అదనంగా ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత వల్ల వచ్చిన 1500 కోట్లు కూడా వచ్చి చేరడంతో రాష్ట్ర అధాయం కొద్దిగా మెరుగుపడింది.

ఈ వర్షకాలంలో రైతుబంధు పథకం కోసం 7 వేల కోట్లు కేటాయించగా ఇందులో 5 వేల 500 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకుంది. అంటే ప్రభుత్వం వద్ద రాష్ర్టానికి వచ్చే స్వీయ అదాయం జూన్ నెల నుండి పెరిగే అవకాశం ఉండటంతో అటు రైతుబంధు పథకంతో పాటు, ఉద్యోగులకి పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. ఇలా సామాన్యులనే కాదు, ప్రభుత్వాన్ని కరోనా వైరస్ ఇబ్బంది పెట్టింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories