భయం వద్దు .. చికెన్ తింటే కరోనా రాదు : కేటీఆర్

భయం వద్దు .. చికెన్ తింటే కరోనా రాదు : కేటీఆర్
x
KTR(File Photo)
Highlights

చికెన్ తింటే కరోనా వస్తోందని వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు మంత్రి కేటీఆర్.. ఈ రోజు హైదరాబాదులో 'చికెన్‌, ఎగ్‌ మేళా'ను ప్రారంభించారు. ఈ వేడుకలో...

చికెన్ తింటే కరోనా వస్తోందని వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు మంత్రి కేటీఆర్.. ఈ రోజు హైదరాబాదులో 'చికెన్‌, ఎగ్‌ మేళా'ను ప్రారంభించారు. ఈ వేడుకలో మంత్రి కేటీఆర్ తో పాటుగా మంత్రులు ఈటల, తలసాని, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..చికెన్ తింటే కరోనా వస్తుందన్న భయాలు అనవసరమని, కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా తన కుటుంబమంతా చికెన్‌ తింటున్నామని మాకేం కాలేదని, ఆరోగ్యం గానే ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఇక ఇదే వేదిక పైన చికెన్ ముక్క రుచి చూశారు.

ఇక ఇదే వేదికలో మంత్రి ఈటెల మాట్లాడుతూ.. చికెన్ తింటే కరోనా వస్తుందన్న వార్తలు నమ్మొద్దన్నారు తమ కుటుంబంలో ఎగ్ తినని రోజు లేదన్నారు. కరోనా భయంతో చికెన్ రేట్లు భారీగా తగ్గిపోయి.. పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోందన్నారు. సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని అయన వెల్లడించారు. అసత్య ప్రచారాలతో చికెన్ పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని, వెంటనే తిరిగి పుంజుకోవాలని, చికెన్ ఫెస్టివల్‌ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఎగ్ అండ్ చికెన్ మేళా జరిగింది. నోరూరించే చికెన్ వంటకాలతో పీపుల్స్ ప్లాజా ఘుమఘుమలాడింది. చికెన్ ప్రియులు వివిధమైన రుచులను ఆస్వాదించారు. కోవిడ్ వైరస్ తో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు తగ్గాయి. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఈ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారికి ఉచితంగా గుడ్లు, చికెన్ పంపిణీ చేశారు. అనవసర భయాలతో చికెన్ తినడం మానేయొద్దని వైద్యులు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories