Hyderabad: కరోనా బాధితుడి బరితెగింపు..

Hyderabad: కరోనా బాధితుడి బరితెగింపు..
x
Highlights

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటుంది.

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటుంది.అయినా కొంత మంది ప్రజలు ప్రభుత్వం మాట పెడచెవిన పెట్టి వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు బయటకి రావొద్దంటూ లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు రోడ్లపైకి వస్తుంది.

ఇక విదేశాల నుంచి ఇటేవలే రాష్ట్రానికి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజువ వరకు హోం క్వారంటైన్ లో ఉండవలసిందిగా నిబంధనలను జారీ చేసింది. అయినా కొంత మంది వ్యక్తులు అధికారుల మాటను కొట్టిపారేసి ఇంటినుంచి బయటికి వస్తున్నారు. అంతే కాదు సామాజిక దూరం పాటించకుండా అందరితో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఓ హైదరాబాద్ యువకుడు హోం క్వారంటైన్ నుంచి బయటికి వచ్చి రోడ్లపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక కరీంనగర్లో కూడా అమెరికానుంచి వచ్చిన దంపతులు ఓం క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఏకంగా ఫంక్షన్ కు వెల్లి అక్కడ అందరితో మెదిలారు.

ఇప్పుడు ఇదే కోణంలో హైదరాబాద్ లోని ఓ యువకుడు హోం క్వారంటైన్ నుంచి తప్పించుకుని తన స్నేహితులతో షికార్లు కొడుతున్నాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువకుడు 8 రోజుల క్రితం లండన్ నుంచి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. కానీ అతను అధికారుల మాటలేం పట్టించుకోకుండా ఏకంగా రోడ్లపైకి వచ్చేసి తిరుగుతున్నారు. అతని స్నేహితులతో కార్లలో షికార్లు చేస్తున్నాడు. అలా తిరుగుతూ స్నేహితులను, బయట తిరిగే వారిని, ఎంతో మందిని కలుస్తున్నాడు. తన చేతిపై అధికారులు వేసిన హోం క్వారంటైన్ ముద్ర కనిపించకుండా చేసి ఈ విధంగా తిరుగున్నాడు.

అయితే ఇలాంటి వారిని అదుపు చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా అయిపోయింది. ఇంక కొంత మంది ఐతే ఏకంగా పోలీసులు ఉపయోగించే లాఠీలను వాడి ప్రజలను కొడుతూ వాటిని వీడియోలు తీస్తూ పోలీసు దాడులంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు పెడుతున్నారు. దీంతో నెటిజన్లు పోలీసులపై కోపోగ్రస్తులవుతున్నారు.

ఇక పోతే నిన్నటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరారయని సీఎం కేసీఆర్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలపారు. అయితే వారితో 11 మంది బాధితులు కోలుకున్నారని, చికిత్స అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని స్పష్టం చేసారు. వారిని మల్లీ పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామ‌ని చెప్పారు. ఇక ఈ కరోనా వైరస్ ను ఏప్రిల్ 7 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories