Top
logo

వారం రోజుల్లోనే ఇల్లు... రోబోటిక్ త్రీడీ సాంకేతికత అద్భుతం!

వారం రోజుల్లోనే ఇల్లు... రోబోటిక్ త్రీడీ సాంకేతికత అద్భుతం!
X
Highlights

సాధారణంగా ఇల్లు కట్టడానికి ఎంతకాదనుకున్నా ఒక సంత్సరం సమయం పడుతుంది, లేదా త్వరగా కట్టాలనుకుంటే 6 సమయం పడుతుంది.

సాధారణంగా ఇల్లు కట్టడానికి ఎంతకాదనుకున్నా ఒక సంత్సరం సమయం పడుతుంది, లేదా త్వరగా కట్టాలనుకుంటే 6 నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు రోబోటిక్ త్రీడీ టెక్నాలజీని ఉపయోగించి కేవలం వారం రోజుల్లోనే ఇల్లు కట్టేస్తున్నారు. అవునండి ఇటీవల సిద్దిపేటలో ఒజాజ్ అనే సంస్థ ఈ ఇంటి నిర్మాణాన్ని ప్రయోగత్మకంగా చేసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో వంద చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఈ ఇంటిని నిర్మించారు. రోబోటిక్ త్రీడీ టెక్నాలజీని ద్వారా నిర్మించిన ఈ ఇంటిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సీఈవో జాషువా మాట్లాడుతూ 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వారి వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించి వారం రోజుల్లోనే ఇంటి నిర్మాణం చేస్తామని తెలిపారు. రష్యా నిపుణుల సహకారంతో త్రీడీ రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

2020 మార్చి వరకూ ఇంటి నిర్మణాలకు సంబంధించిన నూతన టెక్నాలజీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే సిమెంటుతో పాటు నిర్మాణ సమయంలో మిగిలిపోయే వ్యర్థాలను కలిపి మిశ్రమాన్ని తయారుచేస్తామని తెలిపారు. ఈ మిశ్రమాన్ని నిర్మాణాల్లో వాడతామని ఆయన వివరించారు. సాధారణంగా నిర్మించిన ఇంటితో పోల్చుకుంటే ఈ ఇండ్లు చాలా దృఢంగా ఉంటాయన్నారు. అంతే కాక నిర్మాణానికి 20 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని సీఈఓ జాషువా స్పష్టం చేశారు.Next Story