ఓటింగ్ మిషన్స్ భధ్రపరచడానికి గోడౌన్ల నిర్మాణం

ఓటింగ్ మిషన్స్ భధ్రపరచడానికి గోడౌన్ల నిర్మాణం
x
Highlights

తెలంగాణలో నూతన జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీ ప్యాట్ లను భద్రపచడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది....

తెలంగాణలో నూతన జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీ ప్యాట్ లను భద్రపచడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. గోడౌన్ల నిర్మాణాలకు సంబంధింది కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్ లాల్, రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషిని కలిశారు. మే నెలాఖరు నాటికి గోడౌన్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషీ తెలిపారు.

తెలంగాణలోని 23 నూతన జిల్లాల్లో ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీ. ప్యాట్లను భద్రపరిచేందుకు కొత్తగా గోడౌన్ల నిర్మాణంపై ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్.కే.జోషితో కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ కన్సల్టెంట్ బన్వర్ లాల్, తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గోడౌన్లు జిల్లా అసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన కలెక్టరేట్ సముదాయంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆర్ అండ్ బి, విద్యా, పంచాయతీరాజ్ శాఖల ద్వారా గోడౌన్ల నిర్మాణానికి సంబంధించి పనులు చేపడుతున్నట్లు సీఎస్ ఎస్.కే జోషీ తెలిపారు.

ఆర్ అండ్ బి నోడల్ ఏజెన్సీగా పని చేస్తుందని వివరించారు.ప్రతి జిల్లాల్లో ఓటర్ల సంఖ్య, ఈవీఎంల సంఖ్య అసరమైన స్థలం, నిర్మాణం వ్యయం అనుమతులు, టెండర్లు అంశాలతో నివేదిక రూపొందించాలని సీఎస్ అధికారులను కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోడౌన్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు సీఈఐ రజత్ కుమార్. రాష్ర్టంలో ఎనిమిది చోట్ల గోడౌన్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మరో ఐదు చోట్ల టెండర్లు ఫైనలైజ్ చేయగా.. మూడు ప్రాసెస్ లో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి గౌడన్ల నిర్మాణ పూర్తవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్.కే జోషి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories